Thursday, January 23, 2025

ట్విట్టర్ స్థానిక నియమాలు పాటించాల్సిందే: భారత్

- Advertisement -
- Advertisement -

Twitter-ElonMusk

న్యూఢిల్లీ: ఎలెన్ మస్క్ చివరికి ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్నాడు. అయితే ఆయన నేతృత్వంలోని ట్విట్టర్ దేశ నియమాలకు కట్టుబడి ఉండాలని భారత్ నొక్కి చెప్పింది. యాజమాన్యం ఎవరి చేతిలోకి వెళ్లినప్పటికీ నియమాలు అవే ఉంటాయని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వంటి వారిపై విధించిన ప్రభుత్వ నిషేధం గురించి అడుగగా ఆయన ఎలాంటి జవాబు ఇవ్వలేదు. నటి కంగనా రనౌత్ విద్వేషపూరిత, దూషణపరమైన అంశాలను ఉల్లంఘించి ప్రవర్తించినందుకు ఆమెపై గత ఏడాది నిషేధం విధించారు. కానీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకోడాన్ని హర్షిస్తూ పోస్ట్ పెట్టింది. ప్రధాని నరేంద్ర మోడీకి పూర్తి మద్దతుదారైన కంగనా రనౌత్ తన ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించమంటూ ఇతర యూజర్లు చేసిన వినతిని కూడా పంచుకుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News