బ్లూటిక్‌తో గేలిచేసి వెనకకు
ముంబై : గ్రేట్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ ట్విట్టర్‌పై నీలి గీత (బ్లూటిక్)ను పెట్టడం కలవరానికి దారితీసింది. దీనితో ఆయన అభిమానులు తీవ్ర స్థాయిలో ట్వీట్ల నిరసనలు వ్యక్తంచేసి, నానా గొడవకు దిగడంతో ఆ తరువాత ట్వీట్టర్ దిగివచ్చి బ్లూటిక్‌ను తొలిగించివేసింది. వ్యక్తులు లేదా సంస్థల ఒరిజినల్ అకౌంట్‌ను ఇతరుల అకౌంట్స్ నుంచి వేరు చేసేందుకు బ్లూటిక్ ఏర్పాటు చేస్తారు. కొన్ని నిర్థిష్ట సందర్భాలలోనే బ్లూటిక్‌ను తగిలిస్తుంటారు. తమ క్రికెట్ హీరో ఖాతాకు బ్లూటిక్ ముద్రపడటం గురించి తీవ్ర అసహనంతో ఫ్యాన్స్ బ్యాటింగ్‌కు దారితీసింది.
మిస్టర్ కూల్ కామ్ అని ఇటువంటి కామ్‌కు దిగుతారా? అని ట్విట్టర్‌పై ఓ అభిమాని విరుచుకుపడ్డారు. ముందుగా బ్లూటిక్‌ను తీసివేసిన ట్విట్టర్ ఆ తరువాత ఆయన ఖాతాలోపలికి ఈ టిక్‌ను పంపించి చేతులు దులిపేసుకుంది. సాధారణంగా వేదిక నుంచి ఎప్పటికప్పుడు స్పందనలతో యాక్టివ్‌గా లేకపోతే అటువంటి ఖాతాలపై తిరిగి నిర్థారణకు బ్లూటిక్ పెడుతుంది. ధోనీ ఇటీవలి కాలంలో క్రికెట్‌లోనూ దీనికి తోడుగా ట్విట్టర్‌లోనూ పెద్దగా చురుగ్గా లేరు. అయితే కొద్ది నెలల క్రితం ఓ ట్వీట్ వెలువరించారు. తాను తోటపనిలో తీరిక లేకుండా ఉన్నానని, తాను స్టాబెర్రీలను పండిస్తే ఇక వాటిని మార్కెట్‌కు తీసుకువెళ్లేందుకు ఎవరికి సాధ్యం కాదని, ఒక్కటీ మిగలదని వ్యాఖ్యానించారు. స్ట్రాబెరీ పంటఫోటోను జతచేశారు. ఇది జరిగి ఆరు నెలలు అయింది. ఈ పరిమితి దాటడంతో ధోనీ ఖాతాకు హెచ్చరికల క్రమంలో బ్లూటిక్ తగిలించి ఉంటారని వెల్లడైంది.