ట్విట్టర్ డీల్ తర్వాత టెస్లా షేరు 12% పతనం
న్యూఢిల్లీ : సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత టెస్లా సిఇఒ ఎలోన్ మస్క్‌కు షేర్ మార్కెట్ గట్టి షాక్ తగిలింది. బుధవారం న్యూయార్క్ ట్రేడింగ్‌లో టెస్లా కంపెనీ షేర్లు భారీగా 12 శాతం పతనమయ్యాయి. మస్క్ ట్విట్టర్ సొంతం చేసుకున్నారనే వార్తతో వాటాదారులు పెద్దఎత్తున అమ్మకాలు జరిపారు. దీంతో ఒక్క రోజే టెస్లా కంపెనీ విలువ 125 బిలియన్ డాలర్లు (రూ.9.57 లక్షల కోట్లు) తుడిచిపెట్టుకుపోయింది. ఎలోన్ మస్క్ ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు.
మీడియా నివేదికల ప్రకారం, షాంఘై గిగాఫ్యాక్టరీలో వాహనాలను ఉత్పత్తి చేస్తున్నందున టెస్లాకు కీలకమైన మార్కెట్ అయిన చైనాతో మస్క్ వాక్ స్వేచ్ఛపై వివాదాన్ని ఎదుర్కోవచ్చు. మరో ప్రమాదం ఏమిటంటే మస్క్ తన తాజా కొనుగోలు నుండి తప్పుకోవచ్చని ఎన్‌పిఆర్ నివేదిక పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మస్క్ నికర విలువ 257 బిలియన్ డాలర్లు, కానీ ఆయన సంపదలో మూడింట రెండు వంతులు టెస్లా స్టాక్‌లోనే ఉంది. మస్క్ ఆ హోల్డింగ్‌లలో కొన్నింటిని తీసివేసినట్లయితే, అది టెస్లా షేరు ధరను మరింత దిగజార్చవచ్చు. మంగళవారం ఆలస్యంగా నివేదిక పేర్కొంది. యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో దాఖలు చేసిన తాజా వార్షిక నివేదికలో కంపెనీ ఈ విషయాన్ని గురించి పెట్టుబడిదారులను హెచ్చరించింది.