Monday, December 23, 2024

సెలబ్రిటీలకు ట్విట్టర్ షాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ అన్నంత పనీ చేశారు. ట్విట్టర్‌లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘ బ్లూటిక్’కు సబ్‌స్క్రిప్షన్ చార్జీలను తీసుకువచ్చిన మస్క్ డబ్బులు చెల్లించని వారికి ఆ వెరిఫికేషన్ మార్క్‌ను తీసివేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. పలుసార్లు వాయిదా పడిన ఈ ప్రక్రియ గురువారం నుంచి మొదలుపెట్టారు. దీంతో డబ్బులు చెల్లించని సెలబ్రిటీలు కూడా తమ ఖాతాలకు బ్లూటిక్‌ను కోల్పోవలసి వచ్చింది. భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖుల ఖాతాలకు ట్విట్టర్ వెరిఫికేషన్ బ్యాడ్ల్‌ను తొలగించింది.

ఇకపై నెలవారీ ప్రీమియం చెల్లించిన వారికి మాత్రమే వెరిఫైడ్ బ్లూ చెక్‌మార్క్‌లను కొనసాగించనుంది. భారత్‌లో పలువురు రాజకీయ ప్రముఖులు, పలు పార్టీల అధికారిక ఖాతాలకు కూడా బ్లూటిక్‌ను తొలగించారు. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ,పంజాబ్, యుపి ముఖ్యమంత్రులు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు,జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు రాజకీయ ప్రముఖులు ఖాతాలకు ఇప్పుడు వెరిఫైడ్ మార్క్ కనిపించడం లేదు. ఇక బిజెపి, కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీల అధికారిక ఖాతాలకు కూడా బ్లూటిక్‌ను తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News