- Advertisement -
న్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ మరోసారి ధిక్కార చర్యకు పూనుకున్నట్టయింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ముకశ్మీర్, లడఖ్‌లను వేరే దేశంగా చూపుతూ భారత దేశ పటాన్ని వక్రీకరించింది. ఇప్పటికే కొత్త ఐటి నిబంధనల విషయంలో కేంద్రం, ట్విట్టర్ మధ్య వివాదం నడుస్తుండగా, ఇప్పుడు ఈ చర్యతో మరో వివాదం తలెత్తింది. దీనిపై ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు ఎదుర్కోక తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ట్విట్టర్ లోని ట్వీప్ లైఫ్ సెక్షన్‌లో జమ్ముకశ్మీర్, లడఖ్ ప్రాంతాలను భారత్‌లో భూభాగంగా చూపలేదు. వాటిని వేరే దేశంగా పేర్కొంది. భూభాగాలను తప్పుగా గుర్తించిన భారత దేశ పటంపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో కూడా లేహ్ ప్రాంతాన్ని చైనాలో భాగంగా తప్పుగా గుర్తించిన సంగతి తెలిసిందే.
Twitter shows J&k and Ladakh separate countries
- Advertisement -