Monday, December 23, 2024

బ్లూ టిక్‌పై ట్విట్టర్ ’యూ టర్న్’

- Advertisement -
- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో: ట్విట్టర్ ఖాతాలో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్’ను ప్రీమియం సర్వీసుగా మార్చారు దాని కొత్త యజమాని ఎలాన్ మస్క్. అయితే బ్లూ టిక్‌కు నెలవారీ ఛార్జీలు కూడా ప్రకటించేశారు. అయితే దీనివల్ల నకిలీ ఖాతాలు పెరిగిపోవడంతో నాలుక కర్చుకుని ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలిసింది. ట్విట్టర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి వెళ్లినప్పటి నుంచి ఆయన అందరినీ గందరగోళంలో పడేస్తున్నాడు. నెలకు 8 డాలర్లు చెల్లించిన వారికి ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే ‘బ్లూ టిక్’ ఇచ్చారు. శుక్రవారం నుంచి ట్విట్టర్‌లో బ్లూ సబ్‌స్క్రిప్షన్ ఫీచర్ కనిపింటడంలేదని అనేక మంది యూజర్లు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు వెరిఫైడ్ ఖాతాలకు ఊదా రంగులో ‘అఫిషియల్’ ట్యాగ్‌ను ఇస్తోంది. దీనిపై కూడా ఆందోళన వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. ఇప్పుడు దిగ్గజ సంస్థలకు మాత్రమే ఈ ట్యాగ్‌ను ఇస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News