Monday, December 23, 2024

ఆ వీడియోలు తొలగించండి: ట్విట్టర్‌కు కేంద్రం ఆదేశం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడానికి సంబంధించిన వీడియోలను తొలగించవలసిందిగా ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా వేదికలను కేంద్ర ప్రబుత్వం గురువారం ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున వీటికి సంబంధించిన వీడియోలను తొలగించాలని ట్విట్టర్‌తోపాటు ఇతర సోషల్ మీడియా సైట్లను కేంద్రం ఆదేశించింది.

భారతీయ చట్టాలకు లోబడి ఉండాల్సిన బాధ్యత భారత్‌లో పనిచేస్తున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలకు ఉంటుందని ప్రభుత్వం తన ఉత్తర్వులో స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు బుధవారం సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో దేశవ్యాప్తంగా ఆందోళన ఏర్పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News