Wednesday, January 22, 2025

పెర్ఫ్యూమ్ యాడ్ వీడియోలు తొలగించండి

- Advertisement -
- Advertisement -

ట్విట్టర్, యూట్యూబ్‌కు కేంద్రం ఆదేశం

న్యూఢిల్లీ: మహిళలపై లైంగిక దాడులకు పురిగొల్పేందుకు ప్రేరేపించే విధంగా ఉన్న ఒక పెర్ఫ్యూమ్ అడ్వర్టయిజ్‌మెంట్‌కు సంబంధించిన వీడియోలను తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ నుంచి తొలగించవలసిందిగా ట్విట్టర్, యూట్యూబ్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ శనివారం ఆదేశించింది. మహిళలను కించపరిచే విధంగా ఉండడంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మార్గదర్శకాలను ఉల్లంఘించే విధంగా ఉన్న పెర్ఫ్యూమ్ బ్రాండ్ వీడియోలను వెంటనే తొలగించాలని ట్విట్టర్, యూట్యూబ్‌కు రాసిన ఒక లేఖలో మంత్రిత్వశాఖ ఆదేశించింది. ఈ వీడియోలపై సోషల్ మీడియా యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై లైంగిక దాడులకు పురిగొల్పేవిధంగా ఈ యాడ్‌లు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News