Monday, December 23, 2024

ట్విట్టర్(ఎక్స్) యూజర్లు ప్రతి నెలా కొంత చెల్లించాలి: మస్క్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : ఎక్స్(గతంలో ట్విట్టర్) యజమాని ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లో మరో మార్పు చేసేందుకు సిద్ధమయ్యారు. ట్విట్టర్ ఇకపై వినియోగదారులకు ఉచితం కాదని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతన్యాహుతో లైవ్ స్ట్రీమ్‌లో మస్క్ మాట్లాడుతూ, సోషల్ నెట్‌వర్క్ ఇక మారబోతోందని, ఎక్స్ వ్యవస్థను వినియోగించుకునేందుకు కొంత మొత్తం నెలవారీ చెల్లింపు చేయాల్సి ఉంటుందని అన్నారు.

బాట్స్‌ను నియంత్రించడానికి పేమెంట్ తీసుకొస్తున్నామని అన్నారు. ఎక్స్‌లో ఉన్న బాట్స్‌ను తొలగించేందుకు గాను చిన్న మొత్తం వసూలు చేస్తామని, దీని ద్వారా వీటిని నియంత్రించవచ్చని అన్నారు. ప్రస్తుతం ఎక్స్‌లో 550 మిలియన్ నెలవారీ వినియోగదారులు ఉండగా, సగటున 100 నుంచి 200 మిలియన్ పోస్టులు పెడుతుంటారని, వీటిలో బాట్స్ కూడా ఉన్నాయని అన్నారు. ఆండ్రాయిడ్, ఐఒఎస్ యూజర్లు నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అదే వెబ్ యూజర్లు రూ.650 చెల్లించే విధంగా మార్పులు తెలుస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News