Friday, January 24, 2025

వెలుగు పత్రికపై మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలు సరికావు: టిడబ్ల్యుజెఎఫ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఓ పత్రిక, ఛానెల్‌ను బ్యాన్ చేస్తామని మంత్రి చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్లుజెఎఫ్) రాష్ట్ర కమిటి వ్యాఖ్యానించింది. ఎప్పుడు బ్యాన్ చేయాలో తెలుసంటూ వ్యాఖ్యానించడాన్ని తప్పుపట్టింది. పత్రికలో రాసిన వార్తలు, ఛానెల్‌లో ప్రసారాల పట్ల అభ్యంతరాలుంటే జాతీయ ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య అన్నారు. మీడియా ముఖంగా అల్టీమేటం ఇవ్వడం ప్రజాస్వామ్య స్పూర్తిని దెబ్బతీస్తుందని వారన్నారు.

మోడి ముఖ్యమంత్రిగా గుజరాత్‌లో చోటుచేసుకున్న అల్లర్లు, మూకదాడులపై రూపొందించిన బిబిసి డాక్యుమెంటరీని దేశంలో నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి కెటిఆర్ ఖండించడాన్ని స్వాగతిస్తున్నట్లు వివరించారు. సమాజం కోసం మీడియా పనిచేస్తుందని అందుకే రాజ్యాంగం మీడియాను ఫోర్త్ ఎస్టేట్‌గా గుర్తించిందన్నారు. మంత్రి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News