- Advertisement -
సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం పెద్దాపూర్ వద్ద గురువారం రెండు రోడ్డుప్రమాదాలు సంభవించాయి. డివైడర్ పై చెట్లకు నీళ్లు పోస్తున్న ట్యాంకర్ ను వేగంగా వచ్చి అదుపుతప్పిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెట్లకు నీళ్లు పోస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అదే ప్రాంతంలో టైరు పేలి కర్నాటక ఆర్టీసి బస్సు బోల్తా పడింది. బస్సులోని 14 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి గుల్ బర్గాకు వెళ్తోందని బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -