Monday, December 23, 2024

ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ కేసు.. అప్రూవర్‌గా మారిన ఇద్దరు నిందితులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్‌తో ముడిపడి ఉన్న మనీల్యాండరింగ్ కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ్ మాగుంట, ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త దినేష్ అరోరా అప్రూవర్లుగా మారడానికి ఢిల్లీ కోర్టు మంగళవారం అంగీకరించింది. ఈడీ అరెస్టు చేసిన ఈ ఇద్దరూ ప్రస్తుతం బెయిలులో ఉన్నారు. అంతకు ముందు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డి ఈ కేసులో అప్రూవర్‌గా మారారు. స్పెషల్ జడ్జి ఎంకె నాగ్‌పాల్ ఈమేరకు వీరికి అవకాశం కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News