Sunday, December 22, 2024

మహిళాపై హత్యాచారం కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మేడ్చల్: మహిళపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కూకట్పల్లి డివిజన్ ఏసిపి ఏ శ్రీనివాసరావు మీడియా సమావేశం లో తెలిపారు. వివరాల్లోకి వెళితే కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వై జంక్షన్ ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్ లోని షెటర్ ముందు గుర్తు తెలియని మహిళ (45) పై ఇద్దరు యువకులు అర్ధరాత్రి చిత్తు కాగితాలు ఏరుకునే మహిళపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంగారెడ్డికి చెందిన ఇద్దరు యువకులను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు.

సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు సంగారెడ్డి పట్టణంలో ఓ బార్ షాపులో నితిన్ కుమార్ దేవ్, రాహుల్ సాహు అనే యువకులు చేసేవారు. ఆ రోజు అర్ధరాత్రి వరకు పనిచేసిన అనంతరం మద్యం తాగి మద్యం మత్తులో సంగారెడ్డి నుండి కూకట్పల్లి వై జంక్షన్ వరకు లాంగ్ డ్రైవ్ రావడంతో ఆ ప్రాంతంలో చిత్తు కాగితాలు ఏరుకునే మహిళ కనిపించడంతో ఇద్దరు నిందితులు కలిసి ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేశారు.

మరుసటి రోజు తెల్లవారుజామున సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. విచారణలో భాగంగా ఇద్దరు యువకులు ఆ రాత్రి బైక్ పై వచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజ్ లభ్యం కావడంతో వారిని సంగారెడ్డిలో అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా బాలానగర్ జోన్ డిసిపి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కూకట్పల్లి ఏసిపి కె శ్రీనివాసరావు పర్యవేక్షణలో కూకట్పల్లి ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తోపాటు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకన్న, సబ్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు కానిస్టేబుల్ తదితరులు కేసును చేదించారు. ఈ కేసును త్వరగా చేదించిన క్రైమ్ సిబ్బందికి సిపి చేత రివార్డ్స్ అందజేస్తామని ఏసిపి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News