హైదరాబాద్ : అంతరాష్ట్ర డ్రగ్ పెండ్లింగ్ రాకెట్ గుట్టును హయత్‌నగర్ పోలీసులు, ఎల్‌బి నగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా రట్టు చేశారు. రాజస్థాన్‌కు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన ఇద్దరిలో ఒకరు జువైనల్. అరెస్టయిన వారి వద్ద నుంచి రూ.50 లక్షల విలువ చేసే హెరాయిన్, నాలుగు సెల్‌ఫోన్‌లను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒకరైన అశోక్ కుమార్ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. అనంతరం డ్రగ్స్ సరఫరాదారుడిగా అవతారమెత్తాడు. బి ఫార్మసీ సెకండియర్ స్టూడైంటైన అశోక్ కుమార్
జువైనల్‌తో కలిసి రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్ బస్సు ద్వారా హెరాయిన్ డ్రగ్ సరఫరా చేసేవారని రాచకొండ సిపి సుధీర్‌బాబు తెలిపారు. రాజస్థాన్‌లో గ్రాము రూ.5 వేల నుంచి రూ.6 వేల వరకు కొనుగోలు చేసి హైదరాబాద్‌లో గ్రాము రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయించేవారన్నారు. హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సత్యా పార్కింగ్ యార్డ్ వద్ద నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సరఫరా, వినియోగం నేరమని, ముఖ్యంగా విద్యార్థులు ఈ విషయాన్ని పరిగణనలోనికి తీసుకుని వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.