Saturday, January 18, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డిసిపి తిరుపతన్నను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు.

2019 ఎలక్షన్, మునుగోడు,హుజూరాబాద్ దుబ్బాక ఎలక్షన్ టైమ్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు. ప్రవీణ్ తో పాటు.. అదనపు ఎస్పీలను 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. శనివారం ఉదయం వీరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. ఫోన ట్యాపింగ్ లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్ తో పాటు వీళ్ల ప్రమేయం ఉందని గుర్తించిన దర్యాప్తు అధికారులు ఈ ఎస్పీలను అదుపులోకి తీసుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన కుటుంబీకుల ఫోన్లపై ప్రత్యక నిఘా ఉంచినట్లు విచారణ తెలింది. సిఎం రేవంత్ ఇంటికి కిలో మీటర్ పరిధిలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఎన్నో సంచలన విషయాలు ప్రణీత్ రావు వాంగ్మూలంలో నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News