Saturday, January 11, 2025

నకిలీ భారతీయ వీసాలు సృష్టిస్తున్న ఇద్దరు ఆఫ్రికన్ల పట్టివేత

- Advertisement -
- Advertisement -

 

Fake Indian Visa Makers nabbed

న్యూఢిల్లీ: నకిలీ భారతీయ వీసాలు తయారు చేస్తూ పట్టుబడిన ఇద్దరు ఆఫ్రికన్ వ్యక్తులను శుక్రవారం  క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఢిల్లీలోని అవుటర్ జిల్లాలో పట్టుకున్నారని అధికారులు తెలిపారు. నిందితులను ఘనా పౌరుడు ఒర్టెగా లియోనార్డ్ , ఐవరీ కోస్ట్ పౌరుడు డియోమండే అలీగా గుర్తించిన పోలీసులు, వారి వద్ద 17 ఏటిఎం కార్డులు లభించాయని, ఆ ఇద్దరూ సంతృప్తికరంగా జవాబులివ్వలేదని తెలిపారు.

గురునానక్ ఎన్‌క్లేవ్‌లోని ఒక ఫ్లాట్‌లో నకిలీ వీసాలు తయారు చేస్తున్నారనే సమాచారం తమకు అందిందని అధికారులు తెలిపారు. దీని ఆధారంగా, వారు మూడవ అంతస్తులోని వారి నివాసంపై దాడి చేశారు. అప్పుడు వారు  భారతీయ వీసాలపై ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు వెంటనే ల్యాప్‌టాప్‌ను మూసివేసి వారి కార్యకలాపాల గురించి ప్రశ్నించగా తప్పించుకునే సమాధానాలు చెప్పారని పోలీసులు తెలిపారు. పైగా వారు  ఫ్లాట్ నుండి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు, ఆ తర్వాత పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News