Wednesday, January 22, 2025

ప్రాణాంతకమౌతున్న ఫంగల్ మెనింజైటిస్.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికా లోని ఇద్దరు వ్యక్తులు తాజాగా ఫంగల్ మెనింజైటిస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. సౌందర్య చికిత్సలే దీనికి కారణమని అమెరికా, మెక్సికో, దేశాల అధికారులు భావిస్తున్నారు. వీరిద్దరూ మెక్సికోలో లైపోసక్షన్ చికిత్స చేయించుకున్నారు. సౌందర్య చికిత్సగా భావిస్తున్న ఈ చికిత్సలో చర్మం దిగువన పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తారు. ఈ సమయంలో ఫంగస్ వాళ్ల శరీరం లోకి చొరబడుతుంది.

Also Read: అమెరికాలో బైక్ ర్యాలీపై కాల్పులు.

కొన్ని రోజులకు కణాలను ఉబ్బిపోయేలా చేస్తుంది. చివరకు మరణానికి దారి తీస్తుంది. జనవరి నుంచి మే 13 మధ్య కాలంలో దాదాపు 200 మంది అమెరికన్లు ఈ చికిత్స కోసం మెక్సికో వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా వ్యాధుల నియంత్రణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు ఫంగల్ మెనింజైటిస్ సోకినట్టుగా భావిస్తున్న 25 మందిని గుర్తించారు. వీరందరికీ ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. మెక్సికోలో ఈ శస్త్రచికిత్సలను చేస్తున్న రెండు క్లినిక్‌లను మూసివేయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News