Wednesday, January 22, 2025

స్కాట్లాండ్ లో ఇద్దరు ఎపి విద్యార్థులు మృతి

- Advertisement -
- Advertisement -

లండన్: ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలో మునిగి చనిపోయిన సంఘటన స్కాట్లాండ్‌లో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఛాణక్య బొలి శెట్టి(22), జితేంద్రనాథ్ కరుటూరి(27) బ్రిటన్‌లోని డుండీ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతున్నారు. ఇద్దరు తన స్నేహితులతో కలిసి తుమ్మెల్ జలపాతం వద్దకు వెళ్లారు. వారు టెక్కింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు నీటిలో పడిపోయారు. వెంటనే మిగిలిన విద్యార్థులు అత్యవసర సేవలకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. నీళ్లలో నుంచి రెండు మృతదేహాలను బయటకు తీశారు. ఎపిలో ఉన్న వారి కుటుంబ సభ్యులు భారత ఎంబసీ అధికారులు సమాచారం ఇచ్చారు. భారత కాన్సులేట్ అధికారులను మృతుల బంధువులు కలిశారు. డూండీ విశ్వవిద్యాలయం అధికారులు కూడా తగిన సాయాన్ని అందిస్తామని చెప్పారు. భారత ఎంబసీ అధికారులు మృతదేహాలను ఇండియాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News