Wednesday, January 22, 2025

ఈతకు వెళ్లి ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు గల్లంతు

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా బెస్తవారి పేట మండలం పూసలపాడులో విషాదం చోటుచేసుకుంది. చెక్‌డ్యామ్‌లో ఈతకు వెళ్లి ఇద్దరు ఆర్మీ ఉద్యోగులు గల్లంతయ్యారు. దీంతో గాలింపు చర్యలు చేపట్టగా పూసలపాడు చెందిన కర్నాటి రామచంద్రా రెడ్డి మృతదేహం లభ్యమైంది. మరో వ్యక్తి శివకోటి రెడ్డి కోసం పోలీసులు చెక్‌డ్యామ్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకొని రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. చెక్‌డ్యామ్‌ల లోపలికి వెళ్లొద్దని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. ఈత వచ్చిన కూడా చెక్‌డ్యామ్ వద్దకు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలల తాకిడికి కొందరు మునిగిపోతున్నారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News