Friday, November 22, 2024

నకిలీ ఫింగర్ ప్రింట్‌తో జిహెచ్‌ఎంసికి గండి

- Advertisement -
- Advertisement -

రాకున్న హాజరువేస్తున్న కాంట్రాక్టర్లు
అరెస్టు చేసిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరోః నకిలీ వేలిముద్రలతో జిహెచ్‌ఎంసి ఉద్యోగుల హాజరు వేస్తున్న ఇద్దరు కాంట్రాక్టర్లను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఉమేష్, శ్రీరామ్ అనే కాంట్రాక్టర్లు జిహెచ్‌ఎంసిలో పలు పనులు చేస్తున్నారు. వీరు ఇద్దరు తమ పరిధిలో పనిచేస్తున్న స్వీపర్ల నకిలీ ఫింగర్ ప్రింట్లు తయారు చేసి వారు విధులకు హాజరు కాకున్నా హాజరైనట్లు వేస్తున్నారు.

ఇలా ఒక్కో సర్కిల్‌లో 12 నుంచి 16మంది ఉద్యోగులు లేనప్పటికి ఉన్నట్లు ఫింగర్ ప్రింట్‌తో హాజరు వేస్తూ జిహెచ్‌ఎంసి నుంచి వేతనాలు తీసుకుంటున్నారు. ఈ విషయం సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 30 నుంచి 40 నకిలీ ఫింగర్ ప్రింట్స్ శాంపిల్స్‌ను సీజ్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News