Monday, December 23, 2024

పెట్రోల్ పంప్‌పై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two arrested for attacking petrol pump

గన్‌తో బెదిరించి పెట్రోల్ పంపులో విధ్వంసం సృష్టించిన నిందితులు

మనతెలంగాణ, హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్‌పై దాడి చేసిన ఇద్దరు నిందితులను బహదుర్‌పుర పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్ పిఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఫలక్‌నూమాకు చెందిన మహ్మద్ ఇఫ్తికార్ అహ్మద్ అలియాస్ ఇఫ్తికార్, ఎండి యూసుఫ్ అలియాస్ నగేష్ రౌడీషీటర్, సయ్యద్ సులేమాన్ కలిసి ఈ నెల 17వ తేదీన దేవీబాగ్ టెంపుల్ సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకునేందుకు బైక్‌పై మహ్మద్ ఇఫ్తికార్ వెళ్లాడు. బంక్‌లో రూ.500 పెట్రోల్ పోయించుకున్నాడు. డబ్బులు అడిగిన బంక్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో ఇఫ్తికార్ స్నేహితులు ఎండి యూసుఫ్, సయిద్ సులేమాన్ అక్కడికి వచ్చి బొమ్మ పిస్తోల్, కత్తులతో సిబ్బందిని బెదిరించారు.

అంతేకాకుండా పెట్రోల్ బంక్ ఆఫీస్ అద్దాలు, సామగ్రిని పగులగొట్టారు. వీరి దాడినిచూసి భయపడిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. పోలీసులకు ఫోన్ చేయడంతో పెట్రోల్ బంక్‌కు వచ్చి సులేమాన్, యూసుఫ్ పరారు కాగా ఇఫ్తికార్‌ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇఫ్తికార్ అహ్మద్, ఎండి యూసుఫ్ గతంలో పలు నేరాలు చేయడంతో పోలీసులు పిడి యాక్ట్‌పెట్టి జైలుకు పంపించారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ నేరాలు చేయడం ప్రారంభించారు. ఇద్దరిని రిమాండ్‌కు తరలించామని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బహదుర్‌పుర పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News