వనస్థలిపురం: జల్సాలకు అలవాటి పడి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన ఇరువురి యువకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అదివారం జరిగింది. వనస్థలిపురం ఎ.సి.పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎ.సి.పి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కృష్ణ జిల్లా, చంద్రపాడ్ మండలం, కొండపేట గ్రామానికి చెందిన ఎం. ప్రవిన్ కుమార్ ఎల్బీనగర్‌లోని అవినాష్ కళాశాలలో బీ.కాం పైయినల్ ఇయర్ చదువుతూ సి.కే.ఆర్ హాస్టల్‌లో ఉంటున్నాడు.
ఇతని సేహ్నితుడు పి. వరుణ్ కుమార్ ఎల్బీనగర్‌లోని కళ్యాణి మోటర్స్‌లో సెల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. వీరు ఇరువురు యవకులు పక్క పక్క గ్రామానికి చెందిన వారు నగరానికి వచ్చి ఎల్బీనగర్‌లోని ప్రైవేట్ హాస్టలో కలిసి ఉంటున్నారు. జ ల్సాకు అలవాటు పడిన యిరువురు యువకులు ఖర్చులకు డబ్బులు లేక పోవడంతో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఈనెల 7వ తేదీన గురువా రం ఎన్‌జీవోస్ కాలనీకి చెందిన శ్రీతామహలక్ష్మి 8 విరోడ్ నుండి ఇంటికి నడుచుకుంటూ వెళుచుండగా వెనుక నుండి ఎపి. 39.డికె 6565 నెంబర్ గల ద్విచక్ర వాహనంపై వచ్చిన ప్రవిన్ కుమార్, వరున్ లు ఆమె మెడలోని సుమారు 2 లక్షల రూపాయల విలువ గల ఎనమిది గ్రాముల పుస్తేలతాడును అపహరించుకొని పారిపోయారు.
దీంతో బాధితురాలు వనస్థలిపురం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తుండగా ఆదివా రం పనామ గోడౌన్ ఎన్టీయర్ చౌరస్తా సమీపంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన ప్రవీణ్, వరున్‌ల కదలికలను గుర్తించిన పోలీసులు అనుమానం గా వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా ఎన్‌జీవోస్ కాలనీలో చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డామని ఒప్పుకోవడంతో వీరిని అరెస్టు చేసి రిమాండ్ తరలించడం జరిగిందని వనస్థలిపురం ఎ.సి.పి పురుషోత్తం రెడ్డి వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో వనస్థలిపురం సి.ఐ జలందర్‌రెడ్డి డి.ఐ వెంకట్ , యస్.ఐ స్వామి పోలీస్ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.