Tuesday, November 5, 2024

బైక్ స్కీంతో బురిడీ

- Advertisement -
- Advertisement -
Two arrested for cheating in the name of Bike scheme
50శాతం కడితే చాలు బైక్ ఇస్తాం
వివిధ ప్రాంతాల్లో ఆఫీసులు తెరిచిన నిందితులు
300మంది నుంచి రూ.2కోట్లు వసూలు
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన జవహర్‌నగర్ పోలీసులు

హైదరాబాద్: బైక్ స్కీం పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన ఇద్దరు నిందితులను రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్‌నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. మేడ్చల్ జిల్లా, మేడిపల్లి మండలం, పిర్జాదీగూడ, పర్వత్ నగర్, రాఘవేంద్రనగర్‌కు చెందిన కంకుల పల్లవి రెడ్డి వ్యాపారం చేస్తోంది. జవహర్‌నగర్‌కు చెందిన పోలోజు సంజయ్ సెక్యూరిటీ సర్వీసెస్ వ్యాపారం చేస్తున్నాడు. పల్లవి మల్టీ బ్రాండ్ బైక్‌ల వ్యాపారం ప్రారంభించింది. ఎఎస్ రావు నగర్, దమ్మాయిగూడ, మన్‌సాన్‌పల్లి ఎక్స్ రోడ్డు, మహేశ్వరం, దోమడుగులో బ్రాంచీలు ఏర్పాలు చేశారు. బైక్ స్కీంలో ముందుగా 60శాతం కడితే 20శాతం మొము కట్టి బైక్‌ను ఇస్తామని చెప్పారు. అలాగే ఒక కస్టమర్ మరో నలుగురు కస్టమర్లను చేర్చితే 12 ఈఎంఐలు తామే కడుతామని చెప్పారు. దీంతో 300మంది కస్టమర్లు చేరారు, వారి వద్ద నుంచి బైక్‌లు ఇస్తామని చెప్పి రూ.2కోట్లు వసూలు చేశాడు.

50శాతం డబ్బులు కట్టిన వారు 100 రోజులు ఆగితే బైక్‌ను అందజేస్తామని చెప్పారు. మరో స్కీంలో డబ్బులు డిపాజిట్ చేస్తే 100 రోజుల్లో డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఇందులో చేరిన వారికి నిర్ణీత సమయం ముగిసినా కూడా బైక్‌లు ఇవ్వకపోవడం, డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మౌలాలీ హౌసింగ్ బోర్డుకు చెందిన బులేమోని మహేశ్వరి టెలీకాలర్‌గా పనిచేస్తోంది. బాధితురాలు డబ్బులు కట్టినా కూడా బైక్‌న ఇవ్వకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ప్రజల వద్ద వసూలు చేసిన డబ్బులు తీసుకుని పారిపోయేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే పోలీసులు వారి ఇంటిపై దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపర్చగా వారిని రిమాండ్‌కు తరలించారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ బిక్షపతి రావు తదితరులు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News