Monday, December 23, 2024

డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా..

- Advertisement -
- Advertisement -

గచ్చిబౌలి: డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు మాదాపూర్ జోన్ డిసిపి వినీత్ గురువారం వెల్లడించారు. కొండాపూర్‌లో నివాసం ఉంటున్న మారం పవన్ కుమార్ అలియాస్ మచ్చ పవన్, ఆదర్శ్ కుమార్ సింగ్‌లు ఇద్దరు వ్యక్తులు కొండాపూర్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్‌ఓటి, మాదాపూర్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిని

విచారించగా బెంగుళూరు నుంచి ఎండిఎంఏ డ్ర గ్ విశాఖ సరిహద్దుల్లో నుంచి గంజాయిని తక్కువ ధరకు తెచ్చి నగరంలో యువకులను లక్షంగా చేసుకొని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి రూ. 8 లక్షల విలువ చేసే 21.7 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్, 874 గ్రాముల గం జాయిని 1 కారును, 3 మొబైల్ ఫోన్స్, రెండు డిజిటల్ వేయిటింగ్ మిషన్లు స్వాధీనం చేసుకున్నట్లు పో లీసులు తెలిపారు. మత్తుపదార్థాల గురించి ప్రజలకు సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని డిసిపి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News