హైదరాబాద్: పిడిఎస్ రైస్‌ను అక్రమంగా తరిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2,000 కిలోల బియ్యం, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ముషీరాబాద్‌కు చెందిన మహ్మద్ సలాఉద్దిన్, మహ్మద్ రుకునుద్దిన్ ఇద్దరు పిడిఎస్ బియ్యం వ్యాపారం చేస్తూ సంపాదిస్తున్నారు. రేషన్ తీసుకున్న వారి వద్ద నుంచి బియ్యం రూ.10లకు కిలో చోప్పున కొనుగోలు చేసి వాటిని డంప్ చేస్తున్నారు.
వాటిని గన్నీ బ్యాగుల్లో నింపి రాజేంద్రనగర్, జహీరాబాద్, నాందేడ్, బీదర్ తదితర ప్రాంతాల్లో రూ.30 నుంచి రూ.35లకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. ఇద్దరు నిందితులు టాటా వాహనంలో పిడిఎస్ బియ్యాన్ని తీసుకుని వస్తుండగా చిక్కడపల్లి వద్ద పోలీసులు ఆపారు తనిఖీ చేయగా పిడిఎస్ రైస్‌గా తేలింది. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా బియ్యం విషయం బయటపడింది. ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రాజు నాయక్, ఎస్సైలు నవీన్‌కుమార్, సాయికిరణ్ తదితరులు పట్టుకున్నారు.