Monday, December 23, 2024

ఎల్లో వ్యాక్సిన్ నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ: ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సంతోష్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద నుంచి స్టాంప్‌లు, నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, సంతోష్‌నగర్‌కు చెందిన ఎండి ఆసిఫ్ ఉద్దిన్, మల్లా మధూకర్ వ్యాక్సిన్ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు. ఇద్దరు నిందితులు వ్యాక్సిన్ సర్టిఫెకేట్ కావాల్సిన వారి నుంచి రూ.4,000 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసి వ్యాక్సిన్ నకిలీ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు.

ఎల్లో ఫీవర్ ఎక్కువగా ఉంటే దేశాలకు వెళ్లే వారికి ఈ సర్టిఫికేట్ తప్పనిసరి కావడంతో నిందితులు దానిని క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ వేశారు. డబ్బులు తీసుకుని వ్యాక్సిన్ నకిలీ సర్టిఫికేట్లు ఇస్తున్నారు, ముఖ్యంగా ట్రావెలింగ్ ఎక్కువగా చేసే వారికి ఇచ్చినట్లు తెలిసింది. వీటికి ఎలాంటి విలువలేదు, ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ సర్టిఫికేట్లను కేవలం నారాయణగూడలోని ఐపిఎం మాత్రమే జారీ చేసే అధికారం కలిగి ఉంది. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రమేష్‌కుమార్, ఎస్సైలు మల్లేష్, నర్సింగ్ రావు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News