Saturday, January 4, 2025

నకిలీ పాలపొడి తయారు చేస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

Two arrested for making fake milk powder

100 కిలోల నకిలీ పాలపొడి స్వాధీనం

హైదరాబాద్: నకిలీ పాల పొడి తయారు చేస్తున్న ఇద్దరు నిందితులను సౌత్‌జోన్, మాదన్నపేట పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన దోల్‌పూర్ ఫ్రెష్, వారానా మిల్క్ పౌడర్ 100 కిలోలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. హైదరాబాద్, మాదన్నపేటకు చెందిన ఎండి ఆరిఫ్, ఎండి సలీం కలిసి నకిలీ పాలపౌడర్‌ను తయారు చేసి విక్రయిస్తున్నారు. గుజరాత్‌కు చెందిన సోదరులు ఆరిఫ్, సలీం బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు మాదాన్నపేటలో మిల్క్‌ఫౌడర్ వ్యాపారం చేస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన ఇద్దరు సోదరులు తక్కువ ధరకు ఉన్న మిల్క్‌ఫౌడర్, షుగర్ పౌడర్‌ను కలిసి పేరు ఉన్న బ్రాండ్లు దోల్‌పూర్ ఫ్రెష్, వారాణా మిల్క్‌ఫౌడర్ పేరుతో నకిలీ వస్తువులను విక్రయిస్తున్నారు. వీటిని అసలు ధరకు విక్రయిస్తుండడంతో నిజమైన ప్రాడక్ట్‌గా భావించి పలువురు కొనుగోలు చేస్తున్నారు. గతంలో ఇలా చేయడంతో నిందితులను 2017లో సైదాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సై శ్రీశైలం, నరేందర్, నర్సింహులు తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News