50కిలోల గంజాయి స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : నిషేధిత గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఫలక్‌నూమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉండగా వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లు, ఇన్నోవా వాహనం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నల్గొండ జిల్లా, దేవరకొండకు చెందిన ఎండి ఖదీర్ నగరంలోని మలక్‌పేటలో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు, దేవరకొండకు చెందిన ఎండి ముజీబ్ చాంద్రాయణగుట్టలో ఉంటూ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. మిర్యాలగూడకు చెందిన ఎండి అజిజ్ పరారీలో ఉన్నాడు. ముగ్గురు నిందితులు తామ చేస్తున్న పనిలో వస్తున్న డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోవడంలేదు.
దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన ముగ్గరు నగరంలో, మహారాష్ట్రలో గంజాయి విక్రయించేందుకు ప్లాన్ వేశారు. ఎపిలోని విశాఖపట్టణం నుంచి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకువచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే గంజాయి విక్రయించేందుకు నిందితులు వెళ్తున్నట్లు పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఎడిసిపి చక్రవర్తి గుమ్మి పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సై చంద్రమోహన్, శ్రీశైలం, నరేందర్,ఎండి తకియుద్దిన్ పట్టుకున్నారు.