Friday, November 22, 2024

పరువు హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two arrested for murder of Dalit man in Hyderabad

ముస్లిం యువతి, హిందూ యువకుడి వివాహం
ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న జంట
జనవరి31న ఆర్యసమాజ్‌లో పెళ్లి
ఇష్టం లేని వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న సోదరుడు
వెంటాడి హత్య చేసిన యువతి సోదరుడు, బంధువు
వివరాలు వెల్లడించిన ఎల్‌బి నగర్ డిసిపి సన్‌ప్రీత్‌సింగ్

ఎల్‌బి నగర్:  సంచలనం సృష్టించిన పరువుహత్య కేసులో ఇద్దరు నిందితులను సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌బి నగర్ డిసిపి సన్‌ప్రీత్ సింగ్ తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, స్టేషన్ మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ గ్రామానికి చెందిన ఆశ్రిన్ సుల్తానా ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఇద్దరు స్కూల్, కాలేజీ క్లాస్‌మేట్స్ కావడంతో ప్రేమించుకున్నారు. ఈ విషయం ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలియడంతో నాగరాజును ఆశ్రిన్ సోదరుడు సయిద్ మోబిన్ అహ్మద్ హెచ్చరించారు, తమ కూతురితో తిరగవద్దని చెప్పారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకోవాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా నాగరాజు కొద్ది నెలల క్రితం మల్కాజ్‌గిరిలోని మారుతీ షోరూంలో సేల్స్‌మెన్‌గా ఉద్యోగంలో చేరాడు. జనవరి 1వ తేదీన ఇద్దరు రహస్యంగా కలుసుకున్నారు. కొద్ది రోజుల్లోనే వివాహం చేసుకుందామని ఆశ్రిన్‌కు నాగరాజు చెప్పాడు.

ఈ క్రమంలనోనే ఆశ్రిన్ ఐడిపిఎల్ కాలనీ, బాలానగర్‌లోని ఇంటిలో నుంచి జనవరి 30వ తేదీన బయటికి వచ్చి నాగరాజును కలిసింది. ఆర్యసమాజ్‌లో జనవరి31వ తేదీన ఇద్దరు వివాహం చేసుకున్నారు. పంజా అనిల్‌కుమార్ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. తర్వాత తను ఉంటున్న అడ్రస్ గుర్తించకుండా ఉండేందుకు వేరే ఉద్యోగంలో చేరాడు. కుటుంబ సభ్యులకు ఇష్టం లేని వివాహం చేసుకోవడంతో నాగరాజుపై కక్ష పెంచుకున్నారు. నెల రోజుల నుంచి వీరి కదలికలపై సయిద్ మోబిన్ అహ్మద్, మహ్మద్ మసూద్ అహ్మద్ నిఘా పెట్టడంతో ఇద్దరికి అనుమానం వచ్చి విశాఖపట్టణానికి వెళ్లిపోయి కొద్ది రోజుల అక్కడ ఉన్నారు. ఇక తమను ఎవరూ వెంటాడడంలేదని ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చారు.

మారుతీ షోరూం వద్ద నాగరాజును మోబిన్ గుర్తించాడు. తిరిగి నగరానికి వచ్చినట్లు గుర్తించి వారు ఎక్కుడ ఉంటున్నది బయటికి ఎప్పుడు వస్తున్నది గుర్తించారు. ఈ క్రమంలోనే మోబిన్, మసూద్ కలిసి నాగరాజు, ఆశ్రిన్ బైక్‌పై వెళ్తుండగా కిందపడేసారు. సెంట్రింగ్ రాడ్‌తో మోబిన్ నాగరాజు తలపై కొట్టాడు, కింద పడిన తర్వాత కత్తితో పొడిచాడు. మోబిన్, నాగరాజును కత్తితో పొడుస్తుండగా మసూద్ సెంట్రింగ్ రాడ్‌తో కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. నాగరాజు మృతిచెందాడని నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి నిందితులకు శిక్షపడేలా చేస్తామని డిసిపి సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. ఎస్‌ఓటి డిసిపి మురళీధర్, ఇన్స్‌స్పెక్టర్ అంజిరెడ్డి, ఎస్సైలు పట్టుకున్నారు.

ట్రేస్ చేసి పట్టుకున్న పోలీసులు
నాగరాజును హత్య చేసి పారిపోతున్న ఇద్దరు నిందితులను పోలీసులు వేటాడి పట్టుకున్నారు. సయ్యద్ మోబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌ను పట్టుకున్నారు. సిసికెమెరాల ద్వారా ఇద్దరు హత్య చేసినట్లు గుర్తించామని డిసిపి తెలిపారు.

బాలానగర్‌లో మిస్సింగ్ కేసు…
ఇంట్లో నుంచి ఆశ్రిన్ పారిపోయి వచ్చినప్పుడు ఆమె తల్లిదండ్రులు బాలానగర్ పోలీసులకు తమ కూతురు కన్పించడంలేదని ఫిర్యాదు చేశారు. ఇద్దరు అప్పటికే వివాహం చేసుకోవడంతో వారు మేజర్లని ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News