Saturday, November 16, 2024

ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వాట్సాప్‌లో యువతుల ఫొటోలు పంపిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్, స్వైపింగ్ మిషన్, పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…ఖమ్మం జిల్లాకు చెందిన మేకల అఖిల్ కుమార్ అలియాస్ అఖిల్ రెడ్డి, అఖిల్ అలియాస్ అశ్విన్ అలియాస్ జేమ్స్ అలియాస్ క్రాంతి, ఎపిలోని నెల్లూరు జిల్లాకు చెందిన సురేష్ బోయిన అలియాస్ కుమార్ సెట్టి అలియాస్ కరణ్ అలియాస్ సురేష్ సిద్దార్థ కలిసి వాట్సాస్‌లో యువతుల ఫొటోలు పంపిస్తు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. అఖిల్‌కు 2019లో క్లబ్ రోగ్ పబ్బులో దీపక్ రాయ్‌తో పరిచయం ఏర్పడింది. అతడు ఆన్‌లైన్ వ్యభిచారం గురించి వివరించడంతో అప్పటి నుంచి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నాడు.

ఇప్పటి వరకు దాదాపుగా 400 నుంచి 500మంది యువతులను వ్యభిచారంలోకి దింపారు. సినీ పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సురేష్ 2017లో నందు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వ్యభిచారం గురించి చెప్పడంతో ఆ గ్రూపులో సభ్యుడిగా చేరాడు. ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ఇక్కడ హైదరాబాద్‌కు చెందిన ప్రముఖులకు యువతులను సప్లయ్ చేస్తున్నాడు. గోవాలో కూడా అద్దె ఇంటిని తీసుకుని వ్యభిచారం ప్రారంభించాడు. విటులను ఆకర్షించేందుకు లోకాంటో, స్కోక్కా, బ్యాక్‌పేవెబ్‌సైట్‌లో ప్రకటనలు ఇస్తున్నాడు. సైబరాబాద్ పోలీసులు ఈ గ్రూపులోని కొందరిని అరెస్టు చేయడంతో వ్యభిచారం నిర్వహించడం మానివేశాడు. తనను సంప్రదించిన వారిని వేరే ఏజెంట్లకు అప్పగిస్తున్నాడు.

ఇద్దరు నిందితులు ముంబాయి, వెస్ట్‌బెంగాల్, ఢిల్లీ తదితర నగరాల నుంచి యువతులను తీసుకుని వచ్చి ఇక్కడ వ్యభిచారం చేయిస్తున్నారు. ఇద్దరునిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తమ ప్రాంతంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని, వాట్సాప్ నంబర్ 9490617444కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News