Monday, December 23, 2024

నిషేధిత సిగరేట్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నిషేధిత సిగరేట్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం….దిల్‌సుక్‌నగర్, వివి నగర్‌కు చెందిన నేనావత్ శ్రీరాం, జి. వెంకటరమణ, మజహరుద్దిన్ జావెద్ కలిసి పారిస్ సిగరేట్ల విక్రయిస్తున్నారు. శ్రీరాం, వెంకటరమణ ఇద్దరు కలిసి పాట్నా నుంచి తక్కువ ధరకు పారిస్ సిగరేట్లు కొనుగోలు చేసి విఆర్‌ఎల్ లాజిస్టిక్స్ లిమిటెడ్ ద్వారా నగరానికి తీసుకుని వస్తున్నారు.

వాటిని నగరంలోని పలు పాన్‌షాపులు, కిరాణా షాపుల్లో విక్రయిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు పాట్నా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి తీసుకుని వచ్చి విక్రయిస్తున్నారు. 53బండిల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.32,50,000లు ఉంటుంది. కేసు దర్యాప్తు కోసం అబిడ్స్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ ఎండి ఖలీల్ పాషా, ఎస్సై షేక్‌కవియుద్దిన్, నవీన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News