Tuesday, January 21, 2025

చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః  చైనా మాంజా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, చార్మినార్, కాలాపత్తర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,015 బాబిన్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…హైదరాబాద్, మలక్‌పేటకు చెందిన వేణుగోపాల్ బజాజ్, ఎండి షాజిబ్ కలిసి చైనా మాంజా విక్రయిస్తున్నారు.

ఇద్దరు నిందితులు సంక్రాంతికి పతంగులు చాలామంది ఎగుర వేస్తారు. దీంతో చైనా మాంజాకు చాలా డిమాండ్ మార్కెట్‌లో ఉంది. దానిని క్యాష్ చేసుకోవాలని ప్లాన్ వేసిన నిందితులు ఆగ్రా, రాయచూర్ తదితర ప్రాంతాల నుంచి చైనా మాంజాను ప్రైవేట్ ట్రాన్స్‌పోర్టులో నగరానికి తీసుకుని వచ్చి విక్రయిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు. ఇన్స్‌స్పెక్టర్ సైదాబాబు, ఎస్సైలు సాయిరాం, అనంతచారి, పిసిలు నయిం ఖాన్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News