Sunday, January 19, 2025

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two arrested for selling drugs

1040 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం
వివరాలు వెల్లడించిన నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి

మనతెలంగాణ, సిటిబ్యూరోః డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులు, వాటిని తీసుకుంటున్న ఆరుగురు వ్యక్తులను నార్కోటిక్ వింగ్, బొల్లారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1040 గ్రాముల హాష్ ఆయిల్, రెండు మొబైల్ ఫోన్లు, బైక్, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని అల్వాల్‌కు చెందిన నరేష్ రెడ్డి, గాజుల రామారానికి చెందిన చంద్రశేఖర్ డ్రగ్స్ విక్రయిస్తున్నారు.

రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీన్, రాహుల్ గౌడ్, కుందన్ రెడ్డి, ఆయుష్మున్ రెడ్డి, సామ్ రాయ్, ఉదయ్ డ్రగ్స్ తీసుకుంటున్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నరేష్ రెడ్డి ఎపిలోని అరకుకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకున్నాడు. వైజాగ్‌కు వెళ్లి రెండు కిలోల హాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి రూ.60,000 ఇచ్చాడు. కిలో హాష్ ఆయిల్‌ను తీసుకుని నగరానికి వచ్చాడు. నగరంలోని అవసరం ఉన్న వారికి చిన్న బాటిళ్లలో నింపి 5గ్రాముల హాష్ ఆయిల్‌ను రూ.3,000లకు విక్రయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. తన వద్ద హాష్ ఆయిల్ కొనుగోలు చేసిన 29మంది పేర్లను చెప్పాడు. నిందితులను అరెస్టు చేసి బొల్లారం పోలీసులకు కేసు దర్యాప్తు కోసం అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News