Wednesday, January 22, 2025

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర స్మగ్లర్లను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, ఉప్పల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఎండిఎం 100 గ్రాములు, ఓపియం 500 గ్రాములు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసుల కథనం ప్రకారం…రాజాస్థాన్ రాష్ట్రం, జోద్‌పూర్ జిల్లా మనోజ్ వైష్ణోయ్ గ్యాస్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు, బుద్ధా రామ్ అలియాస్ శివాజీ ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న నిందితుడు పరారీలో ఉన్నాడు. ఇద్దరు నిందితులు స్నేహితులు, వారు చేస్తున్న పనివల్ల వచ్చే డబ్బులు జల్సాలకు సరిపోవడంలేదు. దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశారు.

మార్కెట్‌లో డ్రగ్స్‌కు డిమాండ్ ఎక్కువ ఉండడంతో వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి తెలంగాణ రాష్ట్రానికి తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయించాలని ప్లాన్ వేశారు.ఈ క్రమంలోనే రాజాస్థాన్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తితో పరిచయం చేసుకుని, ఓపియం రూ.5,000, రూ.6,000లకు కొనుగోలు చేస్తున్నాడు, ఎండిఎంఏ గ్రాముకు రూ.2,000 నుంచి రూ.4,000లకు కొనుగోలు చసి ఇక్క అవసరం ఉన వారికి రూ.10,000, రూ.12,000లకు విక్రయిస్తున్నాడు. గతంలో బుద్ధా రామ్ గతంలో కూడా డ్రగ్స్ విక్రయిస్తుండగా మీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News