Friday, December 20, 2024

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ఇద్దర్నీ రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ విత్తనాలను ఎల్బీనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, చౌటుప్పల్ పోలీసులు సంయుక్తంగా గుట్టును రట్టు చేశారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఏర్పాటు చేసిన సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పాలందు జిల్లా పెద్దకూరపాడు గరపాడు గ్రామానికి చెందిన గడ్డం రవీంద్రబాబు (29) మహారాష్ట్ర నాగాపుర్ దగ్గర కుహ్లి గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నారు. కృష్ణ జిల్లా మైలవరం గ్రామానికి చెందిన రావి ప్రసన్నకూమార్ (42) యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో నివాసం ఉంటు నవత ఆ గ్రో సీడ్స్, ఫెర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తున్నాడు.

దీంతో రవీంద్రబాబు మహారాష్ట్రలో నకిలీ పత్తి విత్తనాలు కొనుగోలు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకాలు జరిపి తే తొందరగా డబ్బులు సంపాదించాలని ఆలోచన వచ్చింది. నకిలీ పత్తి బిటి విత్తనాలను కొనుగోలు చేసి చౌ టుప్పల్‌లో ప్రసన్నకూమార్ గోదామ్‌లో నిల్వ ఉంచారు. దీంతో వ్యవసాయ అధికారులు, పోలీసులు దాడి చేసి వారి నుంచి రూ.70 లక్షలు విలువైన 2.2 టన్నుల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. రవీంద్రబాబు, ప్రసన్నకూమార్‌ను అరెస్టు చేయగా, నర్సింహ్మలు పరారీ లో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News