Monday, December 23, 2024

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: పాన్‌షాపులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి, సరఫరా చేస్తున్న యువకుడిని సౌత్, ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…అప్పర్‌ధూల్‌పేటకు చెందిన సునీ ల్ సింగ్‌పాన్‌షాపు నిర్వహిస్తున్నాడు, ఆ సిఫ్ నగర్‌కు చెందిన నందకిషోర్ సింగ్ అలియా స్ కిట్టు గంజాయి సరఫరా చేస్తున్నాడు. పాన్‌షాపు నిర్వహిస్తున్న సునీల్‌సింగ్ అవసరం ఉన్న వారికి గంజాయి విక్రయిస్తున్నాడు.

ఈ విషయం తెలిసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిం చగా తనకు గంజాయి సరఫరా చేస్తున్న విష యం చెప్పాడు. దీంతో కిషోర్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తాను ఎపిలోని సీ లేరులోని ఓ రైతు వద్ద కిలోకు రూ.4,000లకు కొగుగోలు చేసి నగరానికి తీసుకుని వస్తున్నట్లు చెప్పాడు. ఇక్కడ అవసరం ఉన్న వారికి రూ. 7,000లకు విక్రయిస్తున్నాడు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసు లు రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ రమేష్ నాయక్, ఎస్సై రాఘవేంద్ర రెడ్డి, తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News