Friday, December 27, 2024

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1.17కిలోల గంజాయి, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…మొయినాబాద్‌కు చెందిన ఇమ్రాన్ ఖాన్ చికెన్ సెంటర్‌లో పనిచేస్తున్నాడు. మదాన్నపేటకు చెందిన సయిద్ ఫిరోజ్ అలీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నిందితులు గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం భవానీనగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News