Monday, December 23, 2024

గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ యువకులు

- Advertisement -
- Advertisement -

మంచిర్యాల: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో గంజాయితో ఇద్దరు యువకులు పట్టుపడిన సంఘటన గురువారం చోటు
చేసుకుంది. బెల్లంపల్లి 1టౌన్ ఎస్ఏహెచ్ ఎన్ దేవయ్య తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని హనుమాన్ విగ్రహం హైవే దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు స్కూటీపై అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా వారి వద్ద ఉన్న స్కూటీ డిక్కీలో 950 గ్రాముల గంజాయి లభ్యమైందన్నారు.

గంజాయితో పట్టుబడిన పైడిమల్ల పృథ్విరాజ్ (పోస్టాఫీస్ బస్తీ), రామ్ మిత్ర(టేకులబస్తీ)లకు చెందిన వారిగా గుర్తించారు. గత కొంత కాలంగా చంద్రాపూర్ నుండితక్కువ ధరకు కొనుగోలు చేసి బెల్లంపల్లిలో యువకులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్లు తెలిపారు. అంతే కాకుండా వారు కూడా. గంజాయిని సేవిస్తున్నట్లు విచారణలో తెలిపారన్నారు. ఈ మేరకు నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు స్తున్నట్లు పోలీసులు  తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News