Monday, January 20, 2025

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి నాలుగు కిలోల గంజాయి చాక్లెట్లు, రెండు కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బాలాపూర్, మల్లాపూర్‌కు చెందిన ఎండి మజీద్ అలియాస్ మజీద్ పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. నిందితుడు సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. దీంతో తనకు తెలిసిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజన్ సింగ్ వద్ద నాలుగు కిలోల గంజాయి చాక్లెట్లను రూ.8,000లకు కొనుగోలు చేశాడు. వాటిని కొరియర్‌లో తెప్పించేవాడు. ఇలా వచ్చిన చాక్లెట్‌ను ఒక్కొటి రూ.40లకు విక్రయించేవాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, కంచన్‌బాగ్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కాగా, గంజాయి విక్రయిస్తున్న యువకుడిని హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్(హెచ్‌న్యూ), మాధురానగర్ పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మధురానగర్‌లోని పిజి హాస్టల్‌లో ఉంటున్న సత్యసాయి అలియాస్ సత్యా గంజాయి విక్రయిస్తున్నాడు. నిందితుడు తరచూ భద్రాద్రి జిల్లా, పాల్వంచ గ్రామానికి వెళ్తుండేవాడు. అక్కడికి చెందిన వినోద్ 2022 నుంచి గంజాయి విక్రయిస్తు డబ్బులు సంపాదించడం చూసేవాడు. దీంతో తాను హైదరాబాద్‌లో గంజాయి విక్రయించాలని ప్లాన్ వేశాడు. తాను కూడా గంజాయి తీసుకునేవాడు, పాల్వంచలో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు విక్రయించేవాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు వెంకటర్‌రెడ్డి, శేఖర్ రెడ్డి, శ్రీనివాస్, డానియల్, ఎస్సైలు కవియుద్దిన్, సాయిరాం, పిసిలు నవ్య, దుర్గాప్రసాద్, సుభాకాంత్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News