Monday, December 23, 2024

చేగుంటలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

చేగుంట: గంజాయి ఎవరు అమ్మిన కొన్న వారిపై కఠిన చర్యలు ఉంటాయని చేగుంట ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు. గురువారం చేగుంట మండల కేంద్రంలో పక్కా సమాచారంతో గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. చేగుంటలోనా అర్ ఆండ్ గేస్ట్ హౌజ్ వద్ద పాతక్ ముకేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న తరువాత ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద చిన్నశంకరంపేట మండలం శంకరాజ్ కొండాపూర్‌కు చెందిన చాకలి సత్తయ్యను తహసీల్దార్ ముందు అదుపులోకి తీసుకుని నిందితుడి వద్ద నుండి 500 గ్రాములు ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

చాకలి సత్తయ్యకు గత 10 సంవత్సరాల నుండి గంజాయి తీసుకునే అలవాటు ఉన్నట్లు సమాచారం. గత 5 సంవత్సరాల నుండి తన పోలంలో 2,3 గంజాయి మొక్కలు పెంచుకుంటూ తన ఇంత సేవిస్తూ మిగతాది అమ్ముకునేవాడు. 2 సంవత్సరాల క్రితం నుండి ఇతనికి పాతక్ ముకేష్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సత్తయ్య అతనికి అమ్మేవాడు పాతక్ ముకేష్ తాను తీసుకున్న గంజాయిని చేగుంట పరిశ్రమల వద్ద అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. పక్కా సమాచారం మేరకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని కోర్టుకు పంపినట్లు ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News