Wednesday, January 22, 2025

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సనత్‌నగర్‌లో ఎస్‌ఓటి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 5.3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…బల్కంపేటకు చెందిన పవన్, మరో వ్యక్తి గంజాయి విక్రయిస్తుండడంతో గతంలో పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నిందితులు మళ్లీ గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఎస్‌ఓటి పోలీసులు బల్కంపేటలోని పవన్ ఇంటిపై దాడి చేయడంతో గంజాయి లభించింది. ఒడిషా నుంచి ఇద్దరు నిందితులు గంజాయిని తీసుకుని వచ్చి కూలీలు, విద్యార్థులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News