Sunday, January 19, 2025

ప్రభుత్వ భూమి విక్రయించిన ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ భూమిని విక్రయించి మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ ఖాజా 1993లో బంజారాహిల్స్, రోడ్డు నంబర్ 2లోని సర్వే నంబర్ 129/2లో ఉన్న 300 గజాల భూమిని కోత సుహాస్, దినేష్ వద్ద నుంచి రూ.60లక్షలకు కొనుగోలు చేశాడు. ఇద్దరు నిందితులు బాధితుడు వృద్ధుడు కావడంతో మోసం చేయాలని ప్లాన్ వేశారు. దీనికి ఆన్‌లైన్‌లో ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసిన కాపీని తీసుకున్నారు. దానిని డిటిపిలో మార్పులు చేర్పులు చేసి బాధితుడికి చూపించారు. దానిని చూసిన బాధితుడు ప్రభుత్వ భూమి రెగ్యులర్ చేసిందని భావించి కొనుగోలు చేశాడు.

మే,2024న కొనుగోలు చేసి ప్లాట్ చుట్టూ రేకులు పెట్టగా షేక్‌పేట తహసిల్దార్, గిరిదవార్ వచ్చి అభ్యంతరం తెలిపారు. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పడంతో బాధితుడు తన వద్ద ఉన్న భూమికి సంబంధించిన డాక్యుమెంట్‌ను చూపించాడు. వాటిని పరిశీలించిన అధికారులు అవి నకిలీ వని చెప్పడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News