Monday, December 23, 2024

ఐపిఎల్ టికెట్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ టికెట్ల బ్లాక్ దందాపై గత కొంత కాలం నుంచి వస్తున్న ఆరోపణలు నిజమని నిరూపించేలా ఉంది. ఐపిఎల్ టెకట్లపై విక్రయంపై ఆరోపణలు రావడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు బ్లాక్‌మార్కెట్‌పై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే ఐపిఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బెంగళూరుకు చెందిన రమణ, హైదరాబాద్‌కు చెందిన శామ్యూల్ కలిసి 101 ఐపిఎల్ టికెట్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి పట్టుకున్నారు.

వారి వద్ద నుంచి 101ఐపిఎల్ టికెట్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులు వాట్సాప్, టెలీగ్రాంలో గ్రూపులు ఏర్పాటు చేసి వెయ్యికి పైగా ఐపిఎల్ టికెట్లను విక్రయించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఇద్దరు యువకులు హైదరాబాద్-,బెంగళూరు జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ టిట్లను అధిక ధరలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News