Wednesday, January 22, 2025

కత్తులు, డాగర్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: ప్రమాదకరమైన కత్తులు, డాగర్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జో న్ టాస్క్‌ఫోర్స్, బోయిన్‌పల్లి పోలీసులు సోమవారం అ రెస్టు చేశారు. వారి వద్ద నుంచి నాలుగు కత్తులు, డాగర్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరానికి చెందిన వినయ్ శర్శ కొలారియా, ఆకాష్ కొలారియా కలిసి హ్యాండీ క్రాప్ట్ వ్యాపారం చేస్తున్నారు. ఇద్దరు రాజస్థాన్‌కు చెందిన వారు కాగా నగరంలోని బోయిన్‌పల్లిలో ఉంటున్నారు. బోయినపల్లిలో జెసి క్రాఫ్ట్ పేరుతో షాపు నిర్వహిస్తున్నారు. వచ్చే లాభాలు వారి అవసరాలకు సరిపోయవడంలేదు.

దీంతో వివాహాలు, బోనాలు, పండుగ సమయాల్లో ప్రదర్శించే క త్తులు, డాగర్లకు నగరంలో డిమాండ్ ఉన్నట్లు తెలుసుకున్నారు. ఒక్కోటి రూ.6,000 నుంచి రూ.15,000 వరకు విక్రయించ వచ్చని తెలుసుకుని వాటిని తయారు చేయించారు. వాటిని రాజస్థాన్ నుంచి హ్యాండీ క్రాఫ్ట్ పేరుతో నగరానికి తీసుకుని వచ్చారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ రఘునాథ్, ఎస్సైలు సాయికిరణ్, నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News