18 ఇంజక్షన్లు స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉండగా వారి వద్ద నుంచి 18 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. సైబరాబాద్ కెపిహెచ్‌బికి చెందిన సాల్మాన్ రాజు, మాదాపూర్‌కు చెందిన అరవింద్, అత్తాపూర్‌కు చెందిన శివశంకర్ కలిసి అధిక ధరలకు రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను విక్రయిస్తున్నారు. కరోనా సమయంలో రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను డిమాండ్ ఎక్కువ ఉండడంతో వాటిని క్యాష్ చేసుకోవాలని ముగ్గురు కలిసి ప్లాన్ వేశారు. వాటిని రూ.15,000 నుంచి రూ.20,000కు విక్రయిస్తున్నారు. ఇలా విక్రయించి సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. విషయం తెలియడంతో బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సై నరేందర్, ఎండి తకియుద్దిన్ తదితరులు పట్టుకున్నారు.