Wednesday, January 22, 2025

స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, హయత్‌నగర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, 30ఇంజక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన బాలాజీ దర్మాజీ పూండుగే హయత్‌నగర్‌లోని శ్రీనివాస్ ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు, ప్రసాద్ గులాడరావు పుండగే మ్యాక్స్ కేర్ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇద్దరు చేస్తున్న పనికి వస్తున్న జీతం సరిపోవడంలేదు.

దీంతో సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితులు మెఫెంట్రమైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు, డేక్లోఫెనా ఇంజక్షన్లు విక్రయిస్తున్నారు. వీటిని వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకుండా ఎవరికీ విక్రయించవద్దు. కానీ నిందితులు మత్తుకు అలవాటు పడిన వారికి విక్రయిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలుసులు ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News