Wednesday, January 22, 2025

సెల్ టవర్ బ్యాటరీలను చోరి చేసిన ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

యాదాద్రిభువనగిరి : ఇటీవలి కాలంలో సెల్‌ఫోన్ టవర్ల దగ్గర చార్జింగ్ బ్యాటరీలను దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు నేరస్తులను అరెస్ట్ చేసినట్లు యాదగిరిగుట్ట సీఐ రమేష్ తెలిపారు. బుధవారం నేరస్తులను అరెస్ట్‌చేసిన సీఐ కేసు వివరాలను విలేఖరులకు తెలియజేస్తూ మాట్లాడారు. ఎస్సైతో సహా పోలీసు సిబ్బంది వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో నిందితులు వెళ్తున్న కారులో అనుమానాస్పదంగా పానాలు, సుత్తె తదితర పరికరాలు కనబడడంతో అదుపులోకి తీసుకొని విచారించగా అనుమానాస్పదంగా మాట్లాడడంతో వారి ద్దరిని మరింత లోతుగా విచారించగా బ్యాటరీల దొంగతనం ఐదు ప్రాంతాల్లో చోరీ చేసినట్టు నేరస్తులు ఒప్పుకున్నారని తెలిపారు.

భువనగిరి పట్టణానికి చెందిన మాదాసు వినోద్, భానుప్రకాశ్‌లు ఇద్దరు గతకొంతకాలంగా డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడినట్టు తెలిపారు. మోటకొండూరు మండల పరిధిలో 26 బ్యాటరీలు, రాజాపేట మండలంలోని సింగారంలో 17, బేగంపేటలో 16, యాదగిరిగుట్ట మండలంలోని మాసాయిపేట గ్రామంలో 16, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలో 16 కలిపి మొత్తం 89 బ్యాటరీలను ఎత్తుకెళ్లి బ్యాటరీలోని పార్ట్‌లను హైదరాబాద్‌లో అమ్ముకొని డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు.

ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి దగ్గర ఉన్న కారును సీజ్ చేసి, రూ.55 వేలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితులు అమ్మిన దొంగ వస్తువుల్లో కొనగోలుదారు చేసినటువంటి పరమేశ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News