Saturday, November 23, 2024

ఎటిఎం డబ్బులు కొట్టేసిన నిందితుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two arrested for stealing money from ATM

హైదరాబాద్: ఎటిఎంలో డబ్బులు లోడ్ చేయకుండా మోసం చేసిన ఇద్దరు ఉద్యోగులను సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.16,43,000నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని సెక్యూర్ వ్యాల్యూ సంస్థ ఐసిఐసిఐ ఎటిఎంలలో డబ్బులు లోడ్ చేస్తుంటుంది. ఈ కంపెనీలో గతంలో పనిచేసిన రాపాక రాజశేఖర్ రెడి ఉద్యోగం మానివేశాడు. ప్రస్తుతం గుండెళ్లి కృష్ణ కస్టోడియన్‌గా పనిచేస్తున్నారు.

ఇద్దరు కలిసి గత కొంత కాలం నుంచి ఎటిఎంలలో డబ్బులు లోడ్ చేయకుండా రూ.1,30,00,000 తీసుకుని సొంతానికి వాడుకున్నారు. ఇది గమనించిన సంస్థ మేనేజర్ శ్రీనివాసరావు సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి ఇద్దరు నిందితులను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాపాక రాజశేఖర్ రెడ్డి గతంలో కూడా ఇలాగే చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. సిసిఎస్ ఎడిసిపి మహేందర్, ఎసిపి బిక్షం రెడ్డి తదితరులు దర్యాప్తు చేశారు.

Two arrested for stealing money from ATM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News