Monday, December 23, 2024

డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 27 ఎండిఎంఏ పిల్స్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….బేగంపేటకు చెందిన సోలోమన్ సుసాయిరాజ్, బోయిన్‌పల్లికి చెందిన దేవరాయ్ కృష్ణ క్రాంత్, గోవాకు చెందిన సప్లయర్ ఫేవర్ కలిసి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్నాడు. ఇందులో ఫేవర్ పరారీలో ఉన్నాడు, ఇద్దరికి ఇతడే డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. సుసాయి రాజ్, దేవరాయ్ కృష్ణ కలిసి గోవా నుంచి తక్కువ డబ్బులకు డ్రగ్స్ కొనుగోలు చేసి తీసుకుని వచ్చి హైదరాబాద్‌లో ఎక్కువ డబ్బులకు విక్రయిస్తున్నారు. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఎస్‌ఓటి ఎల్‌బి నగర్ పోలీసులు పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం ఎల్‌బి నగర్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News