మనతెలంగాణ, సిటిబ్యూరోః రాజస్థాన్ నుంచి డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా పట్టుకున్న వారి వద్ద నుంచి 40 గ్రాములు హెరాయిన్, 100 గ్రాముల ఓపియం, మైటార్ సైకిల్, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డిసిపి తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రాజస్థాన్ రాష్ట్రం, జాలోర్ జిల్లాకు చెందిన పూనం రామ్‌బిష్ణోయ్ పటాన్ చెరువు, బీరమ్మగూడలో ఉంటూ రెయిలింగ్ వర్క్ చేస్తున్నాడు, దినేష్‌కుమార్, ధర్మారామ్ కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నారు. పూనం రామ్, దినేష్‌కుమార్ డ్రగ్స్‌కు బానిసలుగా మారారు. 2017లో బతుకు దెరువు కోసం వచ్చిన నిందితులు ఇక్కడ స్టీల్ రెయిలింగ్ పనిచేస్తూ తర్వాత సొంతంగా వ్యాపారం ప్రారంభించారు. ముందుగా డ్రగ్స్‌కు నిందితులు బానిసలుగా మారారు.
తర్వాత తమ సొంత రాష్ట్రానికి చెందిన ధర్మారామ్ వద్ద ఓపియం, హెరాయిన్ గ్రాముకు రూ.5 నుంచి 6,000లకు కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకుని వచ్చి ఇక్కడి పది వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. నిందితులు సజ్జల్లో డ్రగ్స్‌ను పెట్టి నగరానికి తీసుకుని వస్తున్నారు. ఈ విషయం ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, సరూర్‌నగర్ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్లు సుధాకర్, యాదగిరి, ఎస్సైలు ప్రతాప్‌రెడ్డి తదితరులు పట్టుకున్నారు.